By our Special correspondent
ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని *మార్చి 2, 3, 4 తేదీల్లో* ఆంధ్ర లయోలా కళాశాలతో కలసి మరో 8 కళాశాలల (KVSR SCOPS, ALIET, LBRCE, DIET, PSCMR, SRR & CVR, KBN, NDC) భాగస్వామ్యంతో SAFE (Step Ahead For Equality) లయోలా కళాశాల ఆవరణలో *"SAFE & ALC SCIENCE EXPO 2023"* నిర్వహిస్తున్నాం. *ఉదయం 10 గం.ల నుండి సాయంత్రం 4 గం.ల వరకూ* జరుగుతుంది.
"మహిళల రక్షణ సామాజిక బాధ్యత" నినాదంతో ఇంటి నుండీ మార్పు కోరుకుంటూ మూఢనమ్మకాలు, కాలం చెల్లిన ఆచార వ్యవహారాలు, అశాస్త్రీయ భావజాలం, వివక్షను పెంచే సామెతలు - ఇంటా బయటా వాటి ప్రభావాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ముఖ్యంగా స్కూల్ మరియు కాలేజీ విద్యార్థులలో చైతన్యం కల్పించాలనే లక్ష్యంగా పని చేస్తున్నాం.
నేడు సమాజంలో ఒక నిర్లిప్తత, నిస్పృహ, అనాసక్తి, సమస్యలపట్ల స్పందించక పోవడాన్ని చూస్తున్నాం. ప్రజల్లో ముఖ్యంగా యువతరంలో ప్రశ్నించే గుణం తగ్గిపోతున్నది.
శాస్త్రీయ ఆలోచనలో ప్రధానమైనది ప్రశ్నించటం, ప్రయోగించడం, విశ్లేషించడం, సూత్రీకరించడం. ఈ దృక్పథం సమాజాభివృద్ధికి ఎంతో అవసరం. విద్యార్థుల్లో సహజ సిద్దంగా వుండే ఈ లక్షణాన్ని ప్రోత్సహించడం ద్వారా వారిలో సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితుల పట్ల దృష్టి సారింప చేయాలని తద్వారా ఇంటాబయటా అన్ని రంగాల్లో లింగ సమానత్వాన్ని సాధించే మార్గం సుగమం చేయాలన్న మన ప్రయత్నానికి ఈ సైన్స్ ఎక్స్-పో ఉపకరిస్తుంది.
పిల్లల్లో అభ్యుదయ భావాలు, శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించి తద్వారా అసమానతలు లేని ఆరోగ్యకర సమాజ రూపకల్పనకు ఆసరా కావాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సైన్స్ ఎక్స్-పో జరుగుతున్న మూడు రోజులూ, *మార్చి 2, 3, 4 తేదీలలో పాల్గొని కార్యక్రమ నిర్వహణలో భాగస్తులు కావల్సిందిగా* కోరుతున్నాను. విద్యార్థులను ప్రోత్సహించమని మనవి.
ఈ "ఎక్స్-పో" లో
*“లింగ సమానత్వం” అంశంగా చేసే ఉత్తమ ప్రాజెక్టుకు SAFE ప్రత్యేక బహుమతి* ప్రకటన
సోషల్ సైన్సెస్ ఎక్స్పోలో లింగ సమానత్వం అంశంగా కొన్ని ప్రాజెక్టు నమూనాలు ఇచ్చాం
* *వేతనాల్లో వ్యత్యాసం* : వివిధ దేశాల్లోనూ రంగాల్లోనూ స్త్రీ పురుషులకు ఇచ్చే వేతనాల తేడాలను సమీక్షించడం
* *మీడియాలో మహిళలను ప్రతిబింబించే తీరు:* సినిమాల్లోనూ టీవీ షోలోను ప్రకటనల్లోనూ వివిధ రూపాల్లో మహిళని చిత్రీకరించటం
* *కుటుంబ ఉద్యోగ బాధ్యతల సమన్వయం:* ఉద్యోగ బాధ్యతలను కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకోవడంలో ఆ మహిళలు ఎదుర్కొనే సవాళ్లు దానిపై పరిశీలన
* *లైంగిక వేధింపులు:* పని ప్రదేశంలో గానీ విద్యాసంస్థల లో గాని లైంగిక వేధింపులు జరుగుతున్న తీరు వాటి ప్రభావాలు పైన అధ్యయనం
* *లింగాధరిత శ్రమ విభజన:* ఇంటి పనిలో గృహ బాధ్యతల్లో లింగాధారిత పని విభజన లింగ సమానత్వం పై దాని ప్రభావం పరిశీలించటం
* *రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం:* రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యం వారి భాగస్వామ్యం వారు ఎదుర్కొనే ఆటంకాలు పై విశ్లేషణ
* *ఫెమినిజం:* ఫెమినిస్టు ఉద్యమం ప్రభావం, దాని చరిత్ర,అభివృద్ధి క్రమం పై అధ్యయనం.
**తరగతుల మధ్య వైరుధ్యం:* వర్ణ వివక్షత ,లింగ వివక్షత వంటి వివిధ రూపాలలో జరుగుతున్న అణిచివేత, వాటిపై పరిశీలన.
* *సాంస్కృతిక వైవిధ్యం :* వివిధ కులాలు, మతాల మధ్య ఉన్న మధ్య సాంస్కృతిక సారూప్యతలు, తేడాలు వాటిపై అధ్యయనం.
సర్వే రీసెర్చ్ మానసిక ఆరోగ్యం, రాజకీయ అభిప్రాయాలు, వేధించటం వంటి ప్రత్యేక సామాజిక అంశాలపై సర్వే చేయటం.
ఈ అంశాలపై ప్రాజెక్టుల్లో వివిధ కోణాల్లో పరిశీలించి చారిత్రికంగా, పోల్చడం ద్వారా, వాసి పరంగా, రాశి పరంగా, రీసెర్చ్ చేయడం ద్వారా ఈ పని చేయవచ్చని వారికి తెలియచేసాము.
వీటన్నిటి అంతిమ లక్ష్యం - లింగ సమానత్వానికి సంబంధించిన అనేక అంశాలపై మెరుగైన అవగాహన తీసుకురావడం , ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం అనేది గమనంలో ఉండాలని కోరాం....
ఈ కార్యక్రమానికి విచ్ఛేసి జప్రదం చేయవలసినదిగా సేఫ్ వ్యవస్థాపకులు G. జ్యోత్స్న, G. వాణి ఒక ప్రకటన లో కోరారు.
コメント